సిరిసిల్ల జిల్లాలో వరుస చోరీల కేసులో పురోగతి సాదించారు పోలీసులు. సిరిసిల్లలో తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న 8మంది దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులతోపాటు చోరీ సొత్తును కొన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
నిందితులనుంచి బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. 17.5 గ్రాముల బంగారం, 14.5 తులాల వెండి ఆభరణాలు, మూడు బైకులు, ఒక ఆటో, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటుపడి చోరీ చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
వరుస చోరీలకు పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు పోలీసులు. ప్రతి ఇంటో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే 100కు డయల్ చేయాలని కోరారు సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రాచారి.
►ALSO READ | ఐకేపీ సెంటర్ లో అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన ధాన్యం.. రోడ్డుపై బైఠాయించి రైతుల ధర్నా
